నిజందాగదుక్షణంఆగదు

Mar 17 2024, 07:46

కార్పొరేషన్ల ఏర్పాటుపై హర్షం ..ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్..

కార్పొరేషన్ల ఏర్పాటుపై హర్షం .. 

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన దాసు సురేశ్..

ఆదివాసి దళిత బీసీ, ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ పేదలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ శనివారం వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ..

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ తమ కార్యవర్గసభ్యులతో కలిసి గడిచిన 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు ఫెడరేషన్లకు పాలక మండళ్ళను నియమించకుండా బీసీలు, అణగారినవర్గాల నాయకత్వాన్ని అణగదొక్కిన విషయాన్ని తెలియజేసిన వెంటనే తమ విజ్ఞప్తులకు స్పందించి కార్పొరేషన్లను ప్రకటించడం సబ్బండ వర్గాల అభ్యున్నతిపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని, నిబద్ధతను తెలియజేస్తుందన్నారు..

ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయంలో తాము చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో కులగలనను, బీసీ మైనార్టీ దళిత గిరిజన విద్యార్థులకు రెసిడెన్షియల్ గురుకులాలకు సమీకృత శాశ్వత భవనాలకు మంత్రివర్గ ఆమోదంతెలపడంతోబాటు నిధులను విడుదల చేయడం వాటిలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయ నియామకాలను చేపట్టడం, టెట్ ను ప్రకటించడం లాంటి విషయాలన్నీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతోనే సాధ్యమవుతున్నాయని దాసు సురేశ్ కితాబిచ్చారు..

బీసీలు దళితులు గిరిజనులు అణగారిన వర్గాల ఆర్థిక పరిపుష్టి కోసం ప్రజాపాలనలో వారికి సముచిత ప్రాధాన్యతను ఇస్తూనే ఈ వర్గాల అవకాశాలను ఇనుమడింపజేసేలా సహకరించాలని కోరారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ప్రజాపాలనలో పెద్ద ఎత్తున బిసి దళిత మైనార్టీ గిరిజనులకు పెద్ద ఎత్తున అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు దాసు సురేష్ తెలిపారు.

నిజందాగదుక్షణంఆగదు

Mar 16 2024, 15:41

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్

నేడు నల్గొండ జిల్లా నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జేబీఎస్ ప్రభుత్వ పాఠశాల లో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ చైతన్య జూనియర్ కళాశాల అన్సారి కాలనీ నల్గొండ వారి సౌజన్యంతో విద్యార్థులందరికీ పరీక్షా ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది.

రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థానానికి చేకూరాలని అందరూ 10/10 జిపిఎ సాధించాలని పేదరికం పోవాలంటే ప్రతి ఒక్కరూ మంచి చదువుతోనే జీవితాలు మారుతాయి అని తెలియజేశారు. jbs స్కూల్ హెడ్మాస్టర్ నిర్మల్ రెడ్డి మరియు లెక్చరర్ ఫోరం అధ్యక్షులు డాక్టర్ బొజ్జ కిరణ్ కుమార్ మాట్లాడుతూ..

 విద్యార్థులు గొప్ప లక్ష్యాలు పెట్టుకొని లక్ష్య సాధనతో ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నాగిరెడ్డి శ్రీనివాస్ నరసింహారెడ్డి సంపత్ కుమార్ కర్ణాకర్ రెడ్డి మరియు అధ్యాపకు రాళ్లు రూప రేణుక ప్రతిమ రత్నమాల విద్యార్థి సంఘ నాయకులు జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ కిన్నెర సిద్దు చందు తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Mar 16 2024, 14:12

గోపాల్ గోస.. కండరాల క్షీణత వల్ల పనిచేయలేని వైనం.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు...

గోపాల్ గోస.. కండరాల క్షీణత వల్ల పనిచేయలేని వైనం.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు...

చిట్యాల మండలం నేరేడ గ్రామానికి చెందిన గోపాల్ నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. 18 సంవత్సరాలకే కండరాల క్షీణత వ్యాధితో మంచం పట్టాడు, ఏం పనిచేయలేని పరిస్థితి, ఇటీవల తండ్రి మృతి వల్ల చిన్న భిన్నమైన కుటుంబం, ఘోరంగా మారిన ఇంటి పరిస్థితి, గోపాల్ గురించి ఎన్నో ప్రముఖ పత్రికలు మరియు చానల్లో గోపాల పరిస్థితి గురించి వివరించడం జరిగింది. గోపాల్ 18 సంవత్సరాలకు మంచాన పడితే అతని ప్రస్తుత వయసు 40 సంవత్సరాలు, ప్రస్తుతం తన ఇంటి పరిస్థితి బాలేదని, ప్రజలు తనకు ఆర్థిక సాయం అందించి తన మనుగడకు తోడ్పడాలని ప్రజలను వేడుకోవడం జరిగింది. ఆర్థిక సాయం చేయడానికి ప్రజలు నేరుగా తనకు ఫోన్ చేసి తన పరిస్థితి తెలుసుకున్నాకే ఫోన్ పే ద్వారా కానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ తన సహాయం చేయాలని ప్రజలను వేడుకోవడం జరిగింది.

నిజందాగదుక్షణంఆగదు

Mar 16 2024, 10:53

నల్లగొండ:రామగిరి గ్రామంలో ప్రభుత్వ నిధులతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన...

రామగిరి గ్రామంలో ప్రభుత్వం ద్వారా 5.00.000/- రూ. నిధులతో వచ్చిన C.C రోడ్ ను శంకుస్థాపన కార్యక్రమO నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రామగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ కార్యదర్శి నిమ్మల కృష్ణమూర్తి మరియు గ్రామ అధ్యక్షులు మొగుళ్ళ శ్రీనివాస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెరుక కొమరయ్య మాజీ ఉపసర్పంచ్ ఉప సర్పంచ్ ఆకుల శీను బట్టు మల్లేష్ బొడ్డు అవులయ్య నిమ్మల చిన్న మల్లయ్య ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు లోడంగి మహేష్ టి గూడెం పడాల రమేష్ ఎస్ లింగోటం లో డే సత్తయ్య వంగూరి వెంకన్న ఎల్లంకి సైదులు నోముల మల్లేష్ మాద నరసింహ గ్రామ కార్యదర్శి అనిల్ మరు గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Mar 14 2024, 23:00

పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన నల్లగొండ పద్మశాలి సంఘం నాయకులు

పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన నల్లగొండ పద్మశాలి సంఘం నాయకులు

రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పద్మశాలి కార్పొరేషన్ ప్రకటించినందుకు నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ పొట్ట బత్తుల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో స్థానిక ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి రోడ్లు భవనాలు సినీ ఆటోగ్రాఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు మంత్రి శ్రీమతి కొండా సురేఖ పద్మశాలి గారికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది.

అలాగే ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి అన్ని వర్గాల పద్మశాలీల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరడమైనది.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ పొట్ట బత్తుల సత్యనారాయణ గారు, కార్యదర్శి శ్రీ కర్నాటి యాదగిరి,కార్యదర్శి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు రాపోలు శరభయ్య, మహిళా అధ్యక్షురాలు రాపోలు మంగమ్మ, పట్టణాధ్యక్షుడు మిరియాల స్వామి నాయకులు

దత్త గణేష్

, జెల్లా బిక్షం, ముశం శేఖర్ గారు గంజి నాగరాజు, పసునూరి యోగానందం, మూడ వేణు, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Mar 14 2024, 21:43

దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత అంటే... ..

దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత అంటే...

..

దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 చొప్పున తగ్గింపు

తగ్గిన ధరలు రేపు ఉదయం 6 గంటల నుంచి అమలు

నిజందాగదుక్షణంఆగదు

Mar 14 2024, 21:33

నల్గొండ అడిషనల్ ఎస్పీ గా నియమితులైన రాములు నాయక్ గారికి సన్మానించిన లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరవత్ బాలు నాయక్

నల్గొండ అడిషనల్ ఎస్పీ గా నియమితులైన రాములు నాయక్ గారికి సన్మానించిన లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరవత్ బాలు నాయక్ 

లంబాడి జాతి ఆణిముత్యం వివిధ హోదాలో పదవులు నిర్వర్తించి వృత్తి నే దైవంగా భావించి విశిష్ట సేవలు అందిస్తూ గిరిజన జాతి సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ... గిరిజన సమాజానికి ఎంతో సేవలు అందిస్తూ నల్గొండ అడిషనల్ ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన రాములు నాయక్ గారికీ హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తూ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది కలిసిన వారిలో అల్ ఇండియా బంజారా సేవ సంఘ్ రాష్ట్ర ఆర్గనైసింగ్ సెక్రెటరీ బానోత్ సురేష్ నాయక్ లంబాడి విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు వెంకటేష్ నాయక్ లు పాల్గొన్నారు

నిజందాగదుక్షణంఆగదు

Mar 14 2024, 12:22

పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నల్గొండ యువజన సంఘం నాయకులు పున్న సత్యం

పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నల్గొండ యువజన సంఘం నాయకులు పున్న సత్యం

పద్మశాలీల చిరకాల వాంఛ నెరవేరింది

పద్మశాలీల కార్పోరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం

పార్టీల కతీతంగా అభినందనలు హర్షణీయం

పద్మశాలీలలో వున్న పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి పద్మశాలీల కార్పోరేషన్ ఎంతగానో ఉపయోగ పడుతుందనీ నల్లగొండ పద్మశాలి యువజన సంఘం నాయకులు పున్న సత్యం తెలిపారు.ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న పద్మశాలి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయుటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అన్నారు.పార్టీల కతీతంగా పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు కు సహకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా వ్యాప్తంగా సంబరాలు నిర్వహించుకోవాలని పిలుపు నిచ్చారు.ప్రతి ఒక్క పేద పద్మశాలి ఈ సంబరాల్లో పాల్గొని పద్మశాలి ఐక్యతను చాటాలన్నారు.ఈ కార్పోరేషన్ ఏర్పాటుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ రుణ పడి ఉంటారని తెలిపారు.

నిజందాగదుక్షణంఆగదు

Mar 14 2024, 08:13

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా DRI అధికారుల దాడులు. భారీగా బంగారం, నగదు పట్టివేత...

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా DRI అధికారుల దాడులు. భారీగా బంగారం, నగదు పట్టివేత, 12 మంది అరెస్ట్... గౌహతి, బార్‌పేట, ముజాఫర్‌పూర్, గోరఖ్పూర్ లో అక్రమ బంగారం సీజ్. 61 కేజీల బంగారం, 13 లక్షల నగదు సీజ్ చేసిన DRI అధికారుల

నిజందాగదుక్షణంఆగదు

Mar 14 2024, 08:03

టీఎఫ్ డబ్ల్యూజే-2024 డైరీని ఆవిష్కరించిన రీజినల్ డైరెక్టర్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి. శ్రీనివాస్ రెడ్డి

టీఎఫ్ డబ్ల్యూజే-2024 డైరీని ఆవిష్కరించిన రీజినల్ డైరెక్టర్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి. శ్రీనివాస్ రెడ్డి

 కు కృతజ్ఞతలు తెలిపిన టీఎఫ్ డబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు సగరపు ప్రసాద్

హైదరాబాద్, మార్చి 12 : తెలంగాణ ఫెడరేషన్ వర్కింగ్ జర్నలిస్ట్(టీఎఫ్ డబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు సగరపు ప్రసాద్ ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన సంవత్సర డైరీని పి .శ్రీనివాస్ రెడ్డి రీజినల్ డైరెక్టర్. కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తన కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్న సగరపు ప్రసాద్ కృషి అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా రీజనల్ డైరెక్టర్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి శ్రీనివాస్ రెడ్డి కు సగరపు ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.